మంచిర్యాల, క్రైమ్ మిర్రర్ః సింగరేణి డైరెక్టర్ పాతో హైదరాబాద్ లోని సింగరేణి భవన్‌లో గుర్తింపు సంఘం ఏఐటీయుసీ మంగళవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సింగరేణి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన డిమాండ్ల పరిస్కరించాలని కోరింది. ఈ చర్చల వివరాలను గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసి రెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజు కుమార్ లు వెల్లడించారు. నిలిచిపోయినటువంటి మెడికల్ బోర్డును తక్షణమే ఒక నెలలోపు ఏర్పాటు చేయాలని కోరగా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అదే విధంగా కార్మికుల సొంతింటి పధకం అమలు చేయాలని, పెర్స్పై ఇన్కంటాక్స్ను యాజమాన్యమే చెల్లించాలని కోరగా వచ్చే స్ట్రక్షర్ సమావేశంలో చర్చించి దాని అమలుకు సంబంధించి సాధ్యసాధ్యాలను తెలుపుతామని డైరెక్టర్ పా పేర్కొన్నారు.
అదే విధంగా కార్మికులు ఉద్యోగ విరమణ పొందిన తరువాత ఉద్యోగులు క్వార్టర్లు ఖాళీ చేసిన వెంటనే క్వార్టర్ వెకేషన్ సర్టిఫికేట్ జారీ చేయాలని కోరగా దానికి కూడ అంగీకారం తెలి పారన్నారు. పెండింగ్లో ఉన్న 336 మంది డిపెండెంట్ ఉద్యోగాలు వెంటనే పోస్టుల ఆర్డర్ ఇవ్వాలని కోరగా దానికి కూడ సానుకూలంగా స్పందించినట్లు కోరారు అదే విదంగా గనులపై డిపెండెంట్ ఉద్యోగాల ధరఖాస్తులు కేసువారిగా ఉద్యోగ దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనారోగ్యంతో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లిన ఉద్యోగుల వైద్య పెండింగ్ బిల్లుల సమస్య కూడ పరిస్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు.
మూడు సం వత్సరాలకు సంబందం లేకుండా వెంటనే ట్రాన్స్ ఫార్మర్ల విషయం మాట్లాడగా దీనికి కూడ అంగీకరించారన్నారు. మారు పేర్ల మార్పులతో పాటు అండర్ గ్రౌండ్ అలవెన్స్ కటింగ్తో పాటు , సమస్యలతో డిస్మిస్ అయిన ఇతర కార్మికుల సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఓవర్మెన్లకు పెండింగ్ ప్రమోషన్లు మంజూరు చేయాలని కోరగా దానికి కూడ అంగీకారం తెలిపారన్నారు. అన్ ఫిట్ అయిన _మైనింగ్ ట్రేడ్స్మెన్ ఉద్యోగులకు తగిన షుటేబుల్ ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారన్నారు. సింగరేనిలో గోల్డెన్ షేక్ హ్యాండ్ వీఆర్ఎస్ పథకం అమలు చేయమని చెప్పడం జరిగిందని తెలిపారు.
కాంట్రాక్టు కార్మికులకు జనరల్ సమ్మెలో పాల్గొన్నవాళ్లకు ప్లీన్వేజ్ కటింగ్ నిలిపివేస్తామని హామీ ఇచ్చామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు నిలిపివేసిన దీపావళి బోనస్ లాభాలవాటా కూడ చెల్లించేందుకు అంగీకరిం చారన్నారు. ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యంగా తమ యూనియన్ ఎలాంటి త్యాగాలకైన సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. డైరెక్టర్ పాతో జరిగిన చర్చల్లో ఆ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, డిప్యూటి ప్రధాన కార్యదర్శి సారయ్య పాల్గొన్నారు