HomeతెలంగాణRamayana: రామ‌య‌ణంలో శూర్ప‌ణ‌క‌గా ర‌కుల్ ప్రీత్‌సింగ్‌....! భారీ అంచ‌నాల‌తో శ‌ర‌వేగంగా షూటింగ్‌...

Ramayana: రామ‌య‌ణంలో శూర్ప‌ణ‌క‌గా ర‌కుల్ ప్రీత్‌సింగ్‌….! భారీ అంచ‌నాల‌తో శ‌ర‌వేగంగా షూటింగ్‌…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: భార‌తీయ ఇతిహాసాల‌లో ఎంతో ప్ర‌ముఖ‌మైన‌ది రామాయ‌ణం. రామ‌య‌ణాన్ని రెండు భాగాల సినిమాగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అత్యంత కీల‌క‌మైన శూర్ప‌ణ‌క పాత్ర‌ను ర‌కుల్ ప్రీత్‌సింగ్ పోషిస్తుంది. ఆమె పాత్ర‌కు సంబంధించి చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్‌ రావణాసుడిగా నటిస్తున్న ఈ సినిమా మొదటి భాగం ఇదే యేడాది దీపావళికి విడుదల కానుంది. చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం ఇందులో శూర్పణఖ పాత్రను ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పోషిస్తోందట. ఈ పాత్ర కోసం కొంతకాలం క్రితం పలువురితో టెస్ట్ షూట్‌ చేసిన నితీశ్‌ తివారి చివరకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఈ పాత్రకు ఎంపిక చేశారని చెబుతున్నారు.

ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘యానిమల్‌’ తర్వాత రణబీర్ కపూర్‌ నటిస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టీ ఈ సినిమాపై ఉంది. పైగా రామాయణగాథను ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్‌’ పేరుతో తెరకెక్కించగా, అది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోగా విమర్శలు కొనితెచ్చుకుంది. ఈ నేపథ్యంలో జన్ జీ మెచ్చేలా నితీశ్‌ తివారీ ‘రామాయణ్‌’ను ఎలా తీస్తారనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ‘రామాయణ్‌’లో సన్నీడియోల్‌ హనుమాన్‌గా నటిస్తుండగా, లారా దత్తా కైకేయిగా, ఇందిరా కృష్ణన్ కౌశల్యగా, కాజల్‌ అగర్వాల్ మండోదరిగా నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు