-
పోక్సో బాధిత కుటుంబాన్ని బెదిరింపు.
-
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి
-
పల్లె రవి కుమార్ గౌడ్ డిమాండ్.
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధితులకు అండగా ఉండాల్సింది పోయి, వారిని బెదిరించడం అత్యంత దుర్మార్గమని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి, బర్తరఫ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్, మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
సోమవారం మర్రిగూడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ కుమారుడు భగీరథ ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు, బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా, మూడు నెలల నుంచి కేసు నమోదు చేయకపోవడం వెనుక, ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తమ గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చిన బాధితులను బెదిరించడం, ఏ ధర్మమని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సెక్షన్ 164 కింద మెజిస్ట్రేట్ ముందు, బాధితుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని, సదరు కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైన భగీరథను, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పందుల యాదయ్య, మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేశ్ గౌడ్, సర్పంచ్ సంతోష్ యాదవ్, మాజీ సర్పంచ్ యడ్ల శ్రీరాములు, బీసీ నాయకులు పాలకూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.