Homeతెలంగాణఅజ్ఞాతం వీడిన మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు న‌ర‌హ‌రి...! తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుబాటు...

అజ్ఞాతం వీడిన మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు న‌ర‌హ‌రి…! తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుబాటు…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఆప‌రేష‌న్ క‌గార్ ఎఫెక్ట్ మావోయిస్టు పార్టీ అగ్ర‌నేత‌లు లొంగిపోతున్నారు. తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అజ్ఞాతం వీడి జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిశారు. భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఆయన నక్సల్స్ విధానాలకు ఆకర్షితులయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్‌ కారణంగా ఉద్యమం వైపు వచ్చారు. భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.

తర్వాతి కాలంలో అడవి బాట పట్టారు. మావోయిస్టు అగ్రనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఝార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. పలు కీలక ఆపరేషన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఝార్ఖండ్‌లోని సరండా ఫారెస్ట్‌లో పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్ర కోసం భద్రతా బలగాలు కూంబింగ్ తీవ్రతరం చేయడంతో నరహరి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు