HomeతెలంగాణVijay Devarakonda: రణబాలి గ్లింప్స్ విడుదల...! సెప్టెంబ‌ర్ 11న గ్రాండ్ రిలీజ్‌...

Vijay Devarakonda: రణబాలి గ్లింప్స్ విడుదల…! సెప్టెంబ‌ర్ 11న గ్రాండ్ రిలీజ్‌…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌:టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ నుంచి ఒక ప్రత్యేక మేకింగ్ గ్లింప్స్ను చిత్రబృందం విడుదల చేసింది. రాహుల్ డైరక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు. మేకింగ్ వీడియోలో ‘రణబాలి’ పాత్ర కోసం విజయ్ దేవరకొండ పడిన కష్టాన్ని చూపించారు.

ముఖ్యంగా సినిమాలోని గుర్రపు స్వారీ సన్నివేశాల కోసం ఎంత తీవ్రంగా శిక్షణ తీసుకున్నాడో ఇందులో హైలైట్ చేశారు. మచ్చిక చేసుకోవడానికి అత్యంత కష్టమైన స్టాలియన్ జాతి గుర్రాలతో విజయ్ ప్రాక్టీస్ చేశారు సినిమాలోని గుర్రపు స్వారీ సన్నివేశాలు, భారీ యాక్షన్ ఘట్టాలు ముఖ్య ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది.19వ శతాబ్దంలో, 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘రణబాలి’ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు