Homeఆంధ్ర ప్రదేశ్నా ప్రయాణం జగనన్నతోనే: ఆరె శ్యామల

నా ప్రయాణం జగనన్నతోనే: ఆరె శ్యామల

వైసీపీ అధికా ప్రతినిధి ఆరె శ్యామల తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రస్థాయిలో ఖండించారు. తనను పార్టీ నుంచి దూరం చేయాలని చూస్తున్న శక్తులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందని చీకట్లో చప్పుడు చేస్తున్న వారికి తన గళమే సమాధానమని స్పష్టం చేశారు. తాను కేవలం పదవుల కోసమో.. హోదాల కోసమో రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజల గుండెల్లో చెరగని చోటు సంపాదించుకోవడమే తన పరమావధి అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తనకు ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

తన రాజకీయ ప్రయాణం ఎవరి కరుణతోనో.. దయాదాక్షిణ్యాలతోనో మొదలుకాలేదని ఆరె శ్యామల గుర్తు చేశారు. తన పదునైన స్వరం.. నిబద్ధత.. జగనన్న పక్షాన నిలబడే ధైర్యం మాత్రమే తనను ఈ స్థాయికి చేర్చాయని వివరించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ తనపై ఉంచిన నమ్మకమే తన అసలైన బలమని వెల్లడించారు. తాడేపల్లిలో ఏదో జరుగుతోందని.. “పొగ” కనిపిస్తోందని పనిగట్టుకుని కథలు రాసేవారు వాస్తవాలు గ్రహించాలని హితవు పలికారు. అక్కడ కనిపిస్తున్నది పొగ కాదని.. తన ఎదుగుదల చూసి కొందరిలో మొదలైన కడుపుమంట అని ఆమె ఘాటుగా ఎద్దేవా చేశారు.

తప్పుడు పుకార్లతో గానీ.. నీచమైన కుట్రలతో గానీ తనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడం ఎవరి తరము కాదని శ్యామల తేల్చి చెప్పారు. ప్రతిరోజూ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తప్పుడు కథనాలు రాసేవారు ఉన్నప్పటికీ.. తాను మాత్రం జగన్ ఆశయాల సాధన కోసం అడుగులు వేస్తూనే ఉంటానని ప్రకటించారు. తనను సైలెంట్ చేయాలని చూసే ప్రతి ప్రయత్నం తన పోరాట పటిమను పెంచుతుందని.. తన గళాన్ని మరింత గట్టిగా మారుస్తుందని హెచ్చరించారు. ఇది తన కెరీర్‌కు కౌంట్‌డౌన్ కాదని.. తన సామాజిక పోరాటానికి.. గళానికి మరింత బలంగా మొదలయ్యే అద్భుతమైన స్టార్ట్ అని ఆమె స్పష్టం చేశారు.

నన్ను తగ్గించాలని.. రాజకీయంగా అణగదొక్కాలని చూసే వారు చాలామంది ఉండవచ్చు కానీ.. నన్ను నిలబెట్టేది జగన్ అన్న నమ్మకం.. కోట్లాది ప్రజల నిష్కల్మషమైన ప్రేమ అని శ్యామల భావోద్వేగంగా మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని.. అయితే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. జగనన్న సైనికురాలిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం.. పార్టీ బలోపేతం కోసం తన గళం నిరంతరం వినబడుతూనే ఉంటుందని ఆమె పునరుద్ఘాటించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విష ప్రచారాన్ని.. దుష్ప్రచారాన్ని కార్యకర్తలు నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

పార్టీలో తన ప్రాధాన్యత తగ్గలేదని.. జగనన్న వెంటే తన పయనం కొనసాగుతుందని శ్యామల వివరించారు. ప్రత్యర్థులు ఎన్ని కుయుక్తులు పన్నినా తన సంకల్పాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తూనే ఉంటానని.. ప్రజా క్షేత్రంలోనే తన బలం నిరూపించుకుంటానని తెలిపారు. తనపై జరుగుతున్న దాడి వెనుక ఉన్న శక్తులెవరో అందరికీ తెలుసని.. కాలమే వారికి తగిన సమాధానం చెబుతుందని శ్యామల ఘాటుగా వ్యాఖ్యానించారు. జగనన్న మాటే తనకు వేదమని.. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని ఆమె స్పష్టం చేశారు.

ALSO READ: గుప్తనిధుల కోసమే కాకతీయుల ఆలయం కూల్చివేత.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు సంచలన ఆరోపణలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు