క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్హాన్ చెరువు సమీపంలో ఒక యువకుడిని (అదిత్ పాండే) గుర్తు తెలియని వ్యక్తులు తలపై రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారణగా..
మృతుడిని కుర్మల్‌గూడకు చెందిన అదిత్ పాండే అలియాస్ భజ్రంగ్ (24) గా పోలీసులు గుర్తించారు. ఇతను ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోకు చెందినవాడు మరియు హైదరాబాద్‌లోని ఒక బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.
శనివారం (మే 10, 2026) అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అదిత్‌ను బైక్‌పై తీసుకెళ్లి, తలపై రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు మున్నా అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు.
మున్నా కూడా వాహనాల రికవరీ పనులు చేస్తుంటాడని, తన పరిధిలోని ప్రాంతాల్లో రికవరీ పనులు చేయవద్దని గతంలో అదిత్‌ను హెచ్చరించాడని ప్రాథమిక విచారణలో తెలిసింది. బాలాపూర్ పోలీసులు క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు.