క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెరగనున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 12 నుండి 15 వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పని చేస్తాయి.
డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల కోసం రోజు వారీ కేటాయించే స్లాట్ల సంఖ్యను కూడా పెంచారు. దీనివల్ల ఎక్కువ మందికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అవసరమైతే ఈ ప్రత్యేక డ్రైవ్ సమయంలో సెలవు రోజుల్లో కూడా కార్యాలయాలు పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. భూముల విలువల పెంపు అమల్లోకి రాకముందే తమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని ప్రజలు ప్రయత్నిస్తుండటంతో ఈ రద్దీ ఏర్పడింది.