Homeజాతీయంఆకలి బాధలు ఎలా ఉంటాయో తెలుసు.. సీఎం విజయ్ బాగోద్వేగ వ్యాఖ్యలు

ఆకలి బాధలు ఎలా ఉంటాయో తెలుసు.. సీఎం విజయ్ బాగోద్వేగ వ్యాఖ్యలు

క్రైమ్ మిర్రర్, రాజకీయం:- తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినేత సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఇక నిన్న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ అనంతరం తన చిన్ననాటి జ్ఞాపకాలను అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని చేదు విషయాలను గుర్తు చేసుకుని భాగుద్వేగానికి గురయ్యారు. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నా జీవితకాలంలో ఎన్నో కష్టాలను అనుభవించాను అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆకలి బాధలు ఏంటో నిజ జీవితంలో ఎన్నో సందర్భాల్లో గమనించాను అన్నారు. చిన్ననాటి నుంచి ఇప్పటివరకు ఎన్నో అవమానాలు ఎదుర్కొని నేడు ఈ స్థాయికి చేరుకున్నాను అని తెలియజేశారు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో ఒక ముఖ్యమంత్రిగా తమిళనాడు ప్రజలు నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టారు అని విజయ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఏ లోటు రాకుండా ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తాము అని హామీ ఇచ్చారు. వీరికి లేదా వారికి అని తేడా లేకుండా పారదర్శకంగా పాలన సాగిస్తాను అని అన్నారు. మరీ ముఖ్యంగా ప్రజాధనాన్ని వృధా చేయను అని.. నా పార్టీ నాయకులకు ఈ సభా వేదికగా హెచ్చరిస్తున్నాను అని.. ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజలకు సేవ చేయాల్సిందే అని గెలిచిన ఎమ్మెల్యేలకు విజయ్ సూచనలు చేశారు.దీంతో ప్రమాణస్వీకారం అనంతరం విజయ్ మాట్లాడిన వ్యాఖ్యల పై ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరో అల్పపీడనం.. 48 గంటల్లో భారీ వర్షాలు!

విజ‌య్ ప్ర‌మాణ స్వ‌కారోత్స‌వంలో త్రిష స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు