-
విజయ్ ప్రమాణ స్వీకార సమయంలో ఎమోషన్ అయిన త్రిష…
చెన్నై, క్రైమ్‌మిర్రర్: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ బృహత్తర కార్యక్రమం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వేదికైంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హారయ్యారు. హీరోయిన్ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం ముగిసే వరకు ఆమె ఎంతో సంతోషంగా కనిపించారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో త్రిష ఎమోషనల్ అయ్యారు.
సంతోషంతో కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘సంతోషం వచ్చినా.. బాధ వచ్చినా కన్నీళ్లు తప్పకుండా వస్తాయి’..‘కొన్ని ఫీలింగ్స్‌ను మనసులో దాచుకోలేము’..‘ఈ వీడియో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.