లక్నో, క్రైమ్‌మిర్రర్: ఉత్తర ప్రదేశ్‌లో దారుణమైన దందా వెలుగులోకి వచ్చింది. ఇదీ ఒక కొత్తరకమైన దందా అని పలువురు పేర్కొంటున్నారు. ఓ ముఠా శ్మశాన వాటికలో పని చేసే సిబ్బంది సహాయంతో శవాల మీద దుస్తులను దొంగిలించి మార్కెట్లో అమ్మేస్తోంది. కేవలం దుస్తులు మాత్రమే కాదు నగలను కూడా ఈ ముఠా దొంగిలించి అమ్మేస్తోంది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం… ఇండోర్‌లోని ఓ శ్మశాన వాటికలో పని చేసే సిబ్బంది శవాల మీద ఉన్న దుస్తులను దొంగిలిస్తున్నారు. వాటిని ఓ ముఠాకు విక్రయిస్తున్నారు. ఆ ముఠా శవాల మీది దుస్తులను కొత్తవని జనాలను నమ్మించేలా కవర్లలో ప్యాక్ చేసి మార్కెట్లో అమ్ముతోంది.
ఇండోర్ నుంచి అహ్మదాబాద్ వరకు ఈ దందా సాగుతోంది. శవాలు శ్మశానికి రాగానే అక్కడి సిబ్బంది అంత్యక్రియల కంటే ముందే శవాల మీద నుంచి దుస్తులను తొలగిస్తున్నారు. వాటిని ముఠాకు అందిస్తున్నారు. ఆ ముఠా దుస్తులను ఉతికి, ఐరన్ చేసి మరీ మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముతోంది. శ్మశాన వాటిక దగ్గర ఏజెంట్లు, మధ్యవర్తులు చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. దుస్తులు అందగానే వాటిని చాలా తక్కువ ధరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు.