Homeక్రైమ్ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణ‌మైన దందా ...శ‌వాల మీద దుస్తుల‌ను...!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణ‌మైన దందా …శ‌వాల మీద దుస్తుల‌ను…!

ల‌క్నో, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఉత్తర ప్రదేశ్‌లో దారుణమైన‌ దందా వెలుగులోకి వచ్చింది. ఇదీ ఒక కొత్త‌ర‌క‌మైన దందా అని ప‌లువురు పేర్కొంటున్నారు. ఓ ముఠా శ్మశాన వాటికలో పని చేసే సిబ్బంది సహాయంతో శవాల మీద దుస్తులను దొంగిలించి మార్కెట్‌లో అమ్మేస్తోంది. కేవలం దుస్తులు మాత్రమే కాదు నగలను కూడా ఈ ముఠా దొంగిలించి అమ్మేస్తోంది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం… ఇండోర్‌లోని ఓ శ్మశాన వాటికలో పని చేసే సిబ్బంది శవాల మీద ఉన్న దుస్తులను దొంగిలిస్తున్నారు. వాటిని ఓ ముఠాకు విక్రయిస్తున్నారు. ఆ ముఠా శవాల మీది దుస్తులను కొత్తవని జనాలను నమ్మించేలా కవర్లలో ప్యాక్ చేసి మార్కెట్‌లో అమ్ముతోంది.

ఇండోర్ నుంచి అహ్మదాబాద్ వరకు ఈ దందా సాగుతోంది. శవాలు శ్మశానికి రాగానే అక్కడి సిబ్బంది అంత్యక్రియల కంటే ముందే శవాల మీద నుంచి దుస్తులను తొలగిస్తున్నారు. వాటిని ముఠాకు అందిస్తున్నారు. ఆ ముఠా దుస్తులను ఉతికి, ఐరన్ చేసి మరీ మార్కెట్‌లో తక్కువ ధరకు అమ్ముతోంది. శ్మశాన వాటిక దగ్గర ఏజెంట్లు, మధ్యవర్తులు చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. దుస్తులు అందగానే వాటిని చాలా తక్కువ ధరకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు