Homeజాతీయంప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్న గవర్నర్.. స్పందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్!

ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్న గవర్నర్.. స్పందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్!

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- తమిళనాడు రాష్ట్రంలో టీవీకి పార్టీ అధినేత విజయ్ తన మొదటి రాజకీయ ఎన్నికల ఫలితాలలో సంచలనం సృష్టించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన విజయ్ మొదటి ప్రయత్నంలోనే ఎక్కువ సీట్లు గెలిచి చరిత్ర సృష్టించారు. అయితే ఆ తరువాత విజయ్ ముఖ్యమంత్రి కావడానికి సరైన మెజార్టీ సీట్లు లేవు అని.. గవర్నర్ కావాలనే అడ్డుపడుతున్నారు అని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది అని తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. టీవీకే పార్టీ అధినేత విజయ్ ని గవర్నర్ ఇబ్బందులు పెడుతున్నారు అనడం కరెక్ట్ కాదు అని అన్నారు. ఎలక్షన్ల సమయంలో రోజా ప్రచారం చేయడంతోనే డిఎంకె పార్టీ ఓడిపోయింది అనడం ఎంతవరకు తప్పో ఇది కూడా అంతే పొరపాటు అని అన్నారు. తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి చీర సమర్పించి అనంతరం మీడియా వేదికగా మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఓడిపోతున్నారు అని తెలిపారు. కాగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ రసవత్తరంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి విజయ్ అవుతారు అని ఎంతోమంది ధీమాతో ఉన్నప్పటికీ.. ముందు ముందు ఏం జరగబోతుందో అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వెంటనే విజయ్ ఇటువంటి సంచలనం సృష్టించడం నిజంగా సంచలనమే.

WHO Alert!: ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్!.. కరోనా కంటే డేంజరట

హైదరాబాదులో భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు