హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో హిట్‌కు మరో పేరు అని చెప్పొచ్చు. ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఐదో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అతను ఔట్…!
ఈ సినిమాకు మొదట సంగీత దర్శకుడిగా Bheems Ceciroleo పేరు వినిపించింది. అనిల్ రావిపూడి గత రెండు సినిమాలకు భీమ్స్ ఇచ్చిన సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మాస్ బీట్స్, ఎనర్జిటిక్ సాంగ్స్ సినిమాలకు పెద్ద ప్లస్ అయ్యాయి. దీంతో వెంకీ-అనిల్ కొత్త సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తారని అందరూ భావించారు.
ఇంకొకరు ఎంట్రీ….!
కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందట. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా G. V. Prakash Kumarను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో భీమ్స్ స్థానంలో జీవీ ప్రకాష్ రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
జీవీ ప్రకాష్ ఇప్పటికే తమిళంతో పాటు తెలుగు సినిమాలకు కూడా మంచి సంగీతం అందించారు. ఎమోషనల్ మెలోడీస్ నుంచి మాస్ బీట్స్ వరకు ఆయన ప్రత్యేక శైలి ఉంటుంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా జీవీ ఎలాంటి ఆల్బమ్ ఇస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నట్లు సమాచారం.
సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. వెంకీ-అనిల్ కాంబోలో వస్తున్న మరో ఎంటర్‌టైనర్ కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.