Homeఅంతర్జాతీయందళపతి విజయ్ పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?

దళపతి విజయ్ పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?

  1. దళపతి విజయ్ పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?

  2. వారి జీవితాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తమిళ స్టార్ హీరో నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన విజయ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఆయన స్థాపించిన టీవీకే పార్టీ తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని సాధించడం సంచలనంగా మారింది. అయితే విజయ్ రాజకీయ విజయంతో పాటు ఆయన కుటుంబం, ముఖ్యంగా పిల్లల గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

ఆ ఇద్దరూ ఎవరంటే..!

విజయ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా. ప్రస్తుతం వీరిద్దరూ విదేశాల్లో చదువుకుంటూ తమ తమ జీవితాల్లో బిజీగా ఉన్నారని సమాచారం. జాసన్ సంజయ్ సినిమా రంగంపై ఆసక్తి చూపుతున్నాడు.

అయితే తండ్రిలా నటుడిగా కాకుండా, డైరెక్టర్‌గా పేరు సంపాదించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. లండన్‌లో స్క్రీన్‌రైటింగ్ చదివిన ఆయన, కెనడాలోని టొరంటో ఫిల్మ్ స్కూల్‌లో కూడా ఫిల్మ్ ప్రొడక్షన్‌లో శిక్షణ పొందాడు. ప్రస్తుతం ‘సిగ్మా’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు దివ్య సాషా కూడా తన చదువులపై దృష్టి పెట్టింది. ఆమె గురించి ఎక్కువగా సమాచారం బయటకు రాకపోయినా, కుటుంబానికి దూరంగా కాకుండా తల్లి వద్దే ఉంటూ విద్యను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక విజయ్ రాజకీయ ప్రచార సమయంలో ఆయన పిల్లలు ఎక్కడా కనిపించకపోవడం అందరిలో ఆసక్తి రేపింది. ముఖ్యంగా జాసన్ సంజయ్ తన తండ్రిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడన్న వార్తలు వైరల్ కావడంతో ఈ చర్చ మరింత పెరిగింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.

విజయ్ వ్యక్తిగత జీవితంపై కూడా పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఆయన, భార్య సంగీత మధ్య విభేదాలు ఉన్నాయని, వారు విడివిడిగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలు తల్లితో విదేశాల్లోనే ఉంటున్నారని చెప్పబడుతోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు