-
ఏపీ డిప్యూటీ సీఎం ఎంట్రీ తోనే డీఎంకే దూకుడుకు కళ్లెం
-
సనాతన ధర్మ నినాదంతోనే ఆ పార్టీ పతనం
-
పరోక్షంగా అది టీవీకేకు ప్రయోజనం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: తమిళనాడులో విజయ్ గెలిచారు. కానీ ఆ గెలుపునకు కారణం వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటూ ఆ పార్టీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి.. కానీ తమిళనాడులో డిఎంకె హవాకు చెక్ పెట్టింది మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సనాతన ధర్మ నినాదంతో పవన్ కళ్యాణ్ తమిళనాడులో డీఎంకేను దారుణంగా దెబ్బతీశారని.. దాని ఫలితంగానే ఆ పార్టీ దెబ్బతిందని.. డీఎంకేను విభేదించిన ఓటర్లు టీవీకే వైపు ఏకీకృతం అయ్యారని విశ్లేషణలు మొదలయ్యాయి. విజయ్ కు నేరుగా పవన్ మద్దతు తెలపకపోవచ్చు కానీ.. పరోక్షంగా సహాయపడినట్టేనని ఎక్కువమంది వ్యాఖ్యానిస్తున్నారు. సనాతన ధర్మ నినాదంతో తమిళనాడు రాజకీయ తుట్టను కదిపింది మాత్రం వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అన్న వారు ఎక్కువ మంది ఉన్నారు.
తమిళనాడు పై ఫోకస్..
ఏపీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మ పరిరక్షణ నినాదాలు ఇచ్చారు. ఇతర మతాలకు మాదిరిగానే హిందూ ధర్మ పరిరక్షణకు ఒక బలమైన వ్యవస్థ కావాలని ఆకాంక్షించారు. అయితే ఆ పిలుపును వ్యతిరేకించారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. అయితే ఆ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు పవన్ కళ్యాణ్. అప్పటినుంచి తమిళనాడులో హిందువుల్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. అప్పటినుంచి డిఎంకెను వారు వ్యతిరేకించడం ప్రారంభించారు. అదే సమయంలో హిందూ ఓట్లు ఏకీకృతం అయి టీవికే కు లాభం చేసింది. పొలిటికల్ గా విజయ్ నిలదుక్కుకునేందుకు ఆ పరిణామం ఒక కారణం.
ఆలయాల సందర్శన..
తమిళనాడులో తరచూ హిందూ ఆలయాలను సందర్శించేవారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్కడ ఓ కొండపై దీపం వెలిగించే క్రమంలో వివాదం తలెత్తింది. న్యాయస్థానం సైతం తీర్పు ఇచ్చింది. దానిని అమలు చేయలేదు డీఎంకే ప్రభుత్వం. పైగా న్యాయమూర్తి పై అభిశంసన అంటూ హడావిడి చేశారు డీఎంకే నేతలు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజం పై అది తీవ్ర ప్రభావం చూపింది.
డీఎంకే ప్రభుత్వంపై హిందూ వ్యతిరేక ముద్ర పెరగడానికి కారణమైంది. పరోక్షంగా అన్న డీఎంకే కంటే కొత్త పార్టీ అయినా టీవీకేకు కలిసి వచ్చింది. అలా విజయ్ విజయంలో పవన్ కళ్యాణ్ ఒక భాగం. కానీ ఏపీలో సోషల్ మీడియాలో అవకాశవాద ప్రచారానికి అలవాటు పడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ క్రెడిట్ జగన్ ఖాతాలో వేయాలని చూస్తోంది. తమిళనాడు రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ క్రెడిట్ ను పవన్ కళ్యాణ్ కు ఇస్తున్నారు.