-
10వ తరగతిలో అధిక మార్కులు సాధించిన రాజకుమారి,యామిని
-
పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కారం
-
విద్యార్థినుల విజయాన్ని అందరూ అభినందించారు..
క్రైమ్ మిర్రర్,మిర్యాలగూడ: నల్గొండ జిల్లా, మాడ్గులపల్లి మండలము, పాములపహాడ్ గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు యామిని, పేరబోయిన రాజకుమారి 2026లో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటుకున్నారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి (బీఎల్‌ఆర్) ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం వారికీ అభినందన పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా వారి ఉన్నత విద్య కోసం ప్రొసహకంగా ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత విద్యార్థులు కష్టపడి మంచి ఫలితాలు సాధించడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, విద్యే విజయానికి మార్గమని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. విద్యార్థినుల విజయాన్ని అందరూ అభినందించారు.