Homeవైరల్తిరుమలలో త్రిష దర్శనం…“రిజల్ట్ మనదే” అన్న ఫ్యాన్‌కు స్మైల్ రిప్లై!

తిరుమలలో త్రిష దర్శనం…“రిజల్ట్ మనదే” అన్న ఫ్యాన్‌కు స్మైల్ రిప్లై!

  • తిరుమలలో త్రిష దర్శనం…

  • “రిజల్ట్ మనదే” అన్న ఫ్యాన్‌కు స్మైల్ రిప్లై!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో: హీరోయిన్ త్రిష ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. తన పుట్టిన రోజు సందర్భంగా వేకువజామునే ఆలయానికి చేరుకున్న ఆమె, సుప్రభాత సేవలో పాల్గొని భక్తితో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

త్రిష ఆలయం వెలుపలికి రాగానే అభిమానులు ఆమెను చూడటానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. చాలా మంది సెల్ఫీలు తీసుకోవాలని ప్రయత్నించగా, ఆమె కూడా నవ్వుతూ అందరితో ఆప్యాయంగా మాట్లాడింది. ఈ సమయంలో ఒక అభిమాని “రిజల్ట్ పక్కా మనదే మేడమ్” అంటూ గట్టిగా చెప్పడం అక్కడి వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చింది. ఆ మాట విన్న త్రిష చిరునవ్వుతో స్పందించి, ఒక సరదా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఆ క్షణం వీడియోగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

త్రిష తిరుమల ప్రయాణం గురించి ముందుగానే ఆమె సోషల్ మీడియాలో సంకేతాలు ఇచ్చారు. హైవేపై తిరుపతి బోర్డ్ ఉన్న ఫోటోను పంచుకోవడంతో, ఆమె పుట్టిన రోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోబోతున్నారని అభిమానులు అర్థం చేసుకున్నారు. అదే సమయంలో కొన్ని రాజకీయ పరిణామాలు కూడా జరుగుతుండటంతో, ఆమె దర్శనాన్ని వాటితో కలిపి చూసే వారు కూడా ఉన్నారు.

ఇటీవల త్రిష వ్యక్తిగత జీవితంపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ప్రముఖ నటుడితో ఆమె స్నేహం గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో ఆమె పరోక్షంగా మద్దతు తెలిపిందనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అయితే ఈ విషయాలపై త్రిష ఎక్కడా స్పష్టంగా స్పందించలేదు.

ఇప్పుడీ తిరుమల దర్శనం, అభిమానితో జరిగిన చిన్న సంఘటన కలిసి మరోసారి ఆమెను వార్తల్లో నిలిపాయి. సాధారణంగా త్రిష తన వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయట పెట్టదు. కానీ ఈసారి ఆమె సింపుల్ గా, సహజంగా స్పందించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు