Homeజాతీయంతమిళనాడులో విజిల్ పోడు!

తమిళనాడులో విజిల్ పోడు!

క్రైమ్ మిర్రర్, జాతీయం:- :- తమిళనాడు రాష్ట్రంలో హీరో విజయ్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ విడుదల కాబోతున్న ఫలితాలలో డీఎంకే పార్టీని అధిగమించి విజయ్ పార్టీ టీవీకి ముందుకు దూసుకు వెళ్తోంది. ప్రస్తుతం విజయ్ పార్టీ 85 సీట్లతో ముందంజలో ఉండగా డిఎంకె పార్టీ 48,AIADMK 51 చోట్ల ఆదిక్యంలో ముందుకు కొనసాగుతున్నాయి. మరోవైపు విజయ్ ప్రత్యేకంగా పోటీ చేస్తున్న రెండు చోట్ల కూడా భారీ ఆదిత్యంలో ముందుకు కొనసాగుతున్నారు. దీంతో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో ఎన్నికలు కీలక మలుపులు తిరగనున్నాయి. మొట్టమొదటిసారిగా పార్టీని స్థాపించి పోటీ చేస్తున్న విజయ్ ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రానికి రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని చేపడుతారు అనే స్పష్టత అయితే వస్తుంది. మూడు పార్టీల కార్యకర్తలు మరియు నాయకులు ఈ ఫలితాలపై చాలా ఉత్కంఠంగా ఆసక్తిగా పోలింగ్ల దగ్గర ఎదురుచూస్తున్నారు. ఇంకోవైపు వెస్ట్ బెంగాల్లో ఈసారి బిజెపి తన సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Adhar card : ఫొటో, క్యూ ఆర్ కోడ్‌తో ఆధార్ కార్డు…కేంద్రం కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌…!

నా పెండ్లి జ‌రిపించండి సారూ… కుటుంబ స‌భ్యుల‌పై మ‌హిళ ఫిర్యాదు…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు