Homeక్రీడలుప్లే ఆప్స్ పక్కన పెట్టండి.. ఈ రోజైనా గెలవండి!

ప్లే ఆప్స్ పక్కన పెట్టండి.. ఈ రోజైనా గెలవండి!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఈ సీజన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది.మరోవైపు లక్నో జుట్టు కూడా పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో కొనసాగుతుంది. అయితే ఈరోజు అనూహ్యంగా ఈ ఇరుజట్ల మధ్య మ్యాచ్ అయితే జరగనుంది. ప్లే ఆప్స్ ఆశలను వదులుకున్న ఈ రెండు జట్లు కనీసం ఈరోజు ఫ్యాన్స్ కు ఒక సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించాలి అని అభిమానులు కోరుతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు ఐదు ట్రోఫీలు సాధించి గొప్ప పేరు ఉన్నప్పటికీ గత ఐదు సంవత్సరాల నుంచి ఆశించిన స్థాయిలో ఆడలేక పోతున్నారు. ఈ ఏడాది కూడా ముంబై ఇండియన్స్ జట్టును చూసి ప్రతి ఒక్కరు కూడా ట్రోఫీనీ ముద్దాడుతారు అని అనుకున్నారు. తీరా చూస్తే పాయింట్స్ టేబుల్ లో చివరి నుంచి రెండవ స్థానంలో ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు లక్నో జట్టు కూడా ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబరచకపోవడంతో లక్నో అభిమానులందరూ కూడా దిగులు చెందుతున్నారు. దీంతో ప్లే ఆప్స్ ఆశలు పక్కన పెడితే కనీసం మ్యాచ్ నైనా ఆసక్తికరంగా ఉండేలా చేయాలని ఫ్యాన్స్ ఈ ఇరుజట్ల నుంచి ఆశిస్తున్నారు. కాగా ఇరుజట్ల మధ్య రికార్డ్స్ చూసుకుంటే ఆరు విజయాలతో లక్నోకే ముంబై ఇండియన్స్ పైన పై చేయి ఉంది. మరి ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Adhar card : ఫొటో, క్యూ ఆర్ కోడ్‌తో ఆధార్ కార్డు…కేంద్రం కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌…!

Adhar card : ఫొటో, క్యూ ఆర్ కోడ్‌తో ఆధార్ కార్డు…కేంద్రం కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు