HomeUncategorizedCounting of votes in four states today: నేడే ఆయా రాష్ర్టాల్లో ఓట్ల లెక్కింపు......

Counting of votes in four states today: నేడే ఆయా రాష్ర్టాల్లో ఓట్ల లెక్కింపు… ఆస‌క్తి రేపుతున్న త‌మిళ‌నాడు, పశ్చిమబెంగాల్ ఫ‌లితాలు…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: దేశ వ్యాప్తంగా ఆస‌క్తి రేపుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు మ‌రి కాసేప‌ట్లో మొద‌లు కానుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో ఎన్నికలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

ఈ ఎన్నికలు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైనా వీటి ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాగా, ఇప్పటికే సన్నాహక కౌంటింగ్ కసరత్తును పూర్తి చేయడంతో పాటు ఎలాంటి అవకతవకలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.

బీజేపీ పాగా వేసేనా…

బీజేపీ ప‌శ్చిమ బెంగాల్‌లో పాగా వేయాల‌ని విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించింద‌. ఈ సారి ఎలాగైనా అక్క‌డ గెలిచి చ‌రిత్ర సృష్టించాల‌ని ఎదుదురు చూస్తుంది. అలాగే ద‌క్షిణాది రాష్ర్టాల్లో సైతం బీజేపీ జెండా ఎగుర‌వేయాల‌ని పార్టీ ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు సైతం ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఏదేమైన త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు రాష్ర్టంలో ఆసక్తి రేపుతోంది.

తాజావార్తలు