Homeతెలంగాణతెలంగాణ రాష్ర్ట డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌...!

తెలంగాణ రాష్ర్ట డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: తెలంగాణ రాష్ర్ట నూత‌న డీజీపీగా సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించారు.. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, పండితుల ఆశీర్వచనాలతో ఆయన తన కుర్చీలో ఆసీనులయ్యారు. బాధ్యతలు స్వీకరించే ముందు పోలీసు విభాగం నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు బలగాల క్రమశిక్షణ, గౌరవానికి ప్రతీకగా ఈ కార్యక్రమం సాగింది.

శాంతిభ‌ద్ర‌త‌ల‌కు పెద్ద‌పీట‌…నూత‌న డీజీపీ…

ఈ సంద‌ర్భంగా డీజీపీ కార్యాలయంలోని ఇతర విభాగాల ఉన్నతాధికారులు, ఐపీఎస్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ అపురూప ఘట్టానికి సీవీ ఆనంద్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. తన కెరీర్‌లో అత్యున్నత పదవిని అధిరోహిస్తున్న తరుణంలో కుటుంబం పక్కన ఉండటం ఆయనలో ఉత్సాహాన్ని నింపింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తానని పునరుద్ఘాటించారు. తెలంగాణ పోలీసు బాస్‌గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌కు పలువురు ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థలో ఆయన ఎలాంటి మార్పులు తీసుకువస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు