Homeతెలంగాణరాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే - మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే – మంత్రి కోమటిరెడ్డి

  • మిర్యాలగూడను రానున్న రోజుల్లో ఒక ప్రధాన పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతాం:

  • రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేస్తూ,ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం,స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస నేత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మిర్యాలగూడను రానున్న రోజుల్లో ఒక ప్రధాన పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా హైస్పీడ్ ట్రైన్లు,నేషనల్ హైవేలు,డ్రై పోర్ట్, మరియు గ్రీన్ ఫీల్డ్ హైవేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి తెలిపారు… శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో 500 కోట్లతో ట్రైన్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన డీపీఆర్ ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తవుతుందని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు కేవలం రాష్ట్ర భవిష్యత్తు,అభివృద్ధి నిధుల కోసమేనని అన్నారు.నేషనల్ హైవేపై నిర్మించాల్సిన ఫ్లైఓవర్ పనుల గురించి ఇప్పటికే కాంట్రాక్టర్లతో చర్చలు జరిపామని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.​హైవేపై ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.​.. *కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారికంగా లేఖ రాశామని,జాతీయ రహదారి పై ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.

హరీష్ రావు, కేటీఆర్ పనిలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా బలంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా జిల్లాలోని 12 స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.​ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు