క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఐపీఎల్ లో భాగంగా నిన్న జరిగినటువంటి రెండు మ్యాచ్లు చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. బ్యాట్స్మెన్లు ఆడుతున్న తీరును చూసి ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవుతున్నారు. బ్యాట్స్మెన్లు ఆడుతున్న తీరు బౌలర్లను జోకర్స్ చేస్తుంది. శనివారం సందర్భంగా నిన్న జరిగినటువంటి రెండు మ్యాచ్లు చాలా ఉత్కంఠంగా సాగాయి. కేవలం రెండు మ్యాచ్లలో కలిపి 984 పరుగులు వచ్చాయి అంటే బ్యాట్స్మెన్లు ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టించారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఏ బౌలర్ వేసినా బ్యాట్స్మెన్ మాత్రం బౌండరీ దాటేలా బంతులను కొడుతున్నారు. ప్రతి బాల్ ఫోర్ లేదా సిక్సర్ కొట్టాలనే ఆలోచనలోనే బ్యాట్స్మెన్లు ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా చాలామంది కూడా బౌండరీల సైజు పెంచాలి అని సరికొత్త ఆలోచనలు తెరపైకి తీసుకువస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా బౌలర్ అవ్వాలని అనుకోరు అంటున్నారు. కానీ కొంతమంది బ్యాటర్లు ఎలా అయితే విరుచుకుపడి ఆడుతున్నారో బౌలర్లు కూడా అలానే ఫోకస్ చేస్తూ వేయాలి అని బౌలర్లకు సూచిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికే పలువురు క్రికెట్ విశ్లేషకులు ఈ విషయంపై చర్చించిన విషయం తెలిసిందే. త్వరగా బీసీసీఐ ఈ విషయంపై కొన్ని చర్చలు అయితే కచ్చితంగా జరపాలి అని కోరుతున్నారు.
సంఘం అభివృద్ధికి పాటుబడుతా : పెరుమాళ్ళ ప్రణయ్ కుమార్
S.A. Dharmadhikari: లా విద్యలో మనుస్మృతి, బుద్ధిజం బోధించాలి.. మద్రాస్ హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు!