Wednesday, March 4, 2026
Homeతెలంగాణరైలు కిందపడి నవ దంపతుల ఆత్మహత్య...

రైలు కిందపడి నవ దంపతుల ఆత్మహత్య…

క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్:
రైలు కిందపడి నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా నవీన్ పేట్ మండలంలో చోటుచేసుకుంది. ఫకీరాబాద్- మిట్టపల్లి మధ్య రైలు కిందపడి నవ దంపతులను మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతికి ముందు సెల్ఫీ వీడియోను తీసుకున్నారు. మృతులు పోతంగల్ మండలం ఎగ్దోలి గ్రామానికి చెందిన అనిల్ (28), శైలజ (24) గా గుర్తించారు. ఈ దంపతులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నించిన కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నవ దంపతుల ఆత్మహత్య పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తప్పు చేశానని భర్త క్షమించిన బంధువులు బతకనీయడం లేదంటూ ఆ సెల్ఫీలో శైలజ పేర్కొంది. తానేదో తప్పు చేశానని ఆ తప్పును భర్త అనిల్ క్షమించాడని కానీ బంధువులు మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొంది.

అనిల్ కు శైలజకు ఏడాది క్రితం వివాహం జరిగింది పెళ్లి తర్వాత వీరి సంసారం సజావుగా సాగింది. అయితే తాను చేసిన ఓ తప్పును తన పిన్ని బంధువులందరికీ చెప్పినట్లు శైలజ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

  1. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పలో వరల్డ్ హెరిటేజ్ వాక్…
  2. అన్నదాతలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  3. రైతు రుణమాఫీకీ మార్గదర్శకాల జారీ.. అదే ప్రామాణికం!!!
  4. వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్ సంచిత్ గంగ్వార్
  5. కేఎస్‌ఆర్టీసీ బాటలో టీజీఎస్‌ఆర్టీసీ.. బస్సు ఛార్జీల పెంపుపై కేటీఆర్ ట్వీట్!!

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments