తూర్పుగోదావరి , క్రైమ్ మిర్రర్: సూచిక బోర్డును కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. నల్లజర్ల మండలం వీరవల్లిలో ప్రమాదం సంభవించింది. కాగా వీరవల్లి టోల్‌గేట్ వద్ద 500 మీటర్ల సూచిక బోర్డును కారు ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వైపునకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
ప్రమాద విషయం తెలియగానే పోలీసులు హుటాహుటీనా సంఘటన స్థలానికి చేరకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు