అమరావతి, క్రైమ్ మిర్రర్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు కోసం సిబిఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది.జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ధర్మాసనం కొన్ని నిబంధనలతో కూడిన అనుమతినిచ్చింది.ఈనెల 20వ తేదీ నుంచి మే నెల 15వ తేదీ వరకు సుమారు రెండు వారాలపాటు జగన్మోహన్ రెడ్డి యూరప్, యూకే దేశాలలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కేసుల నేపథ్యంలో దేశం దాటిపోతున్న నిబంధన మేరకు ఆయన సిబిఐ కోర్టును ఆశ్రయించారు. జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కొన్ని నిబంధనలతో కూడిన అనుమతి…
దీంతో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కొన్ని నిబంధనలతో ఈ విదేశీ పర్యటనకు అంగీకరించింది.తన పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ,బస చేసే ప్రదేశాల వివరాలు ఫోన్ నెంబర్లను సిబిఐ కి కోర్టుకు సమర్పించాలని సూచించింది.అలాగే పర్యటనకు సంబంధించి ఒక లక్ష పూచికత్తుగా సమర్పించాలని కోర్టు పేర్కొంది . అంతేకాకుండా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే కోర్టుకు హాజరుకావాలని ,ఒకవేళ నేరుగా రాలేక పోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై తన రాకను ధృవీకరించాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు తెలుస్తోంది.
