Homeక్రైమ్ఘోర ప్రమాదం: ఆ రోజు ముగ్గురు అక్కడికక్కడే మృతి...!

ఘోర ప్రమాదం: ఆ రోజు ముగ్గురు అక్కడికక్కడే మృతి…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ సమీపంలో ఏప్రిల్ 13, 2026 న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, లారీ డ్రైవర్ మొహమ్మద్ షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌పై నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైనందుకు సెక్షన్ 106 BNS కింద కేసు నమోదు చేశారు.

రుక్మాపూర్ గ్రామానికి చెందిన కవిరాజ్ (40), అతని భార్య పావని (35), మరియు వారి కుమార్తె కీర్తన (11) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదంలో వీరి కుమారుడు కార్తీక్ (13) స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం అతను తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పావని సోదరుడి వివాహ శుభకార్యం నిమిత్తం జహీరాబాద్ నుండి రుక్మాపూర్‌కు వచ్చిన ఈ కుటుంబం, తిరిగి వెళ్తుండగా తట్టేపల్లి శివారులో ఎదురుగా వచ్చిన లారీ వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు