క్రైమ్ మిర్రర్,జాతీయం :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు ఒకవైపు వర్షాలు మరోవైపు ఎండలు దంచి కొట్టినప్పటికీ ప్రజలకు ఎండ తీవ్రత అనేది తెలియలేదు. కానీ నేడు తెల్లవారుజామున ఎనిమిదింటికి మొదలుకొని విపరీతమైన ఎండలు అంతకుమించి పెరిగిపోతూ ఉండడంతో ప్రజలు సైతం బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఈ ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి కూడా ఎండలు ప్రతిరోజు ముదురుతూ వస్తున్నాయి. తాజాగా పలు రాష్ట్రాల్లో 40 నుంచి 45 డిగ్రీలు నమోదు అవుతుండడంతో ప్రజలు ఎండకు విలవిలలాడిపోతున్నారు. ఇప్పటికే నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎంతో మంది వడదెబ్బకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక రాబోయే మే మరియు జూన్ నెలలో ఎండలు మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు ఇప్పటినుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది మొత్తం కూడా వేసవి అనేది సుదీర్ఘంగా ఉంటుంది అని ఇప్పటికే వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఏదైనా వాతావరణ మార్పులతో వర్షాలు కురిస్తే తప్ప వేసవి నుంచి ఉపశమనం లభించదు అని నిపుణులు చెబుతున్నారు. నిన్న ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపు 215 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు నెలల్లో మరింత ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఐపీఎల్ లో మొట్టమొదటిసారిగా బుమ్రా విఫలం!
Digital Arrest Scam: జాగ్రత్త! డిజిటల్ అరెస్ట్ స్కామ్.. బాపట్లలో రిటైర్డ్ టీచర్ బలి!
