Homeజాతీయంబిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్‌కు డేట్ ఫిక్స్..!

బిగ్‌బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్‌కు డేట్ ఫిక్స్..!

క్రైమ్ మిర్రర్, జాతీయం:- బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 త్వరలోనే గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, ఇప్పుడు ల్యాండ్‌మార్క్ పదో సీజన్‌తో మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి షోను కొత్త హంగులు, ప్రత్యేక కాన్సెప్టులతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తాజాగా జియోస్టార్ విడుదల చేసిన అధికారిక ప్రకటనతో బిగ్‌బాస్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.జియోస్టార్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈసారి బిగ్‌బాస్ చరిత్రలో తొలిసారిగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో షో ఒకేసారి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ నుంచి అన్ని భాషల సీజన్లు ఏకకాలంలో జియోస్టార్ టెలివిజన్ నెట్‌వర్క్‌తో పాటు జియోహాట్‌స్టార్ ఓటీటీ వేదికలో ప్రసారం చేయనున్నారు. దీంతో వేర్వేరు భాషల సీజన్ల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.

జన నాయకుడు పూర్తిగా భగవంత్ కేసరి రీమేక్ కాదు.. అసలు కథపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

తెలుగు బిగ్‌బాస్‌కు ఈసారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా కొనసాగనున్నారు. అలాగే హిందీ వెర్షన్‌కు సల్మాన్ ఖాన్, తమిళానికి విజయ్ సేతుపతి, కన్నడకు కిచ్చా సుదీప్, మలయాళానికి మోహన్‌లాల్ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. బెంగాలీ బిగ్‌బాస్‌కు భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తొలిసారి హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టడం ఈ సీజన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.ఈ సందర్భంగా జియోస్టార్ ఇండియాస్ బిగ్ రియాలిటీ పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేసింది. అందులో వెల్లడించిన వివరాల ప్రకారం, బిగ్‌బాస్ ఆరు భాషల్లో కలిపి 500 మిలియన్లకు పైగా ప్రేక్షకులను సంపాదించింది. దక్షిణ భారతదేశంలోనే మూడు కోట్లకు పైగా ప్రేక్షకులు ఈ షోను వీక్షిస్తున్నారని, ప్రతి 10 మంది టీవీ ప్రేక్షకుల్లో ఎనిమిది మంది బిగ్‌బాస్‌ను చూస్తున్నారని పేర్కొంది. అలాగే జియోహాట్‌స్టార్‌లో లైవ్ ఫీడ్‌కు కూడా భారీ ఆదరణ లభిస్తున్నట్లు వెల్లడించింది.ప్రేక్షకాదరణ పెరుగుతున్న కొద్దీ బిగ్‌బాస్‌కు బ్రాండ్ భాగస్వామ్యాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 46 విభాగాలకు చెందిన 625కు పైగా బ్రాండ్లు ఈ షోతో భాగస్వామ్యం కుదుర్చుకోగా, వాటిలో 49 కొత్త బ్రాండ్లు ఉన్నట్లు జియోస్టార్ వెల్లడించింది. భారీ అంచనాల మధ్య ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఈసారి ఎలాంటి సరికొత్త అనుభూతిని అందిస్తుందో చూడాలి.

కన్నడ సినిమాపై దిల్ రాజు రూ.120 కోట్ల భారీ పందెం.. కెరీర్‌లోనే అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ డీల్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు