HomeతెలంగాణMG University: మండుతున్న ఎండలు.. మహాత్మాగాంధీ యూనివర్సిటీ కీలక నిర్ణయం!

MG University: మండుతున్న ఎండలు.. మహాత్మాగాంధీ యూనివర్సిటీ కీలక నిర్ణయం!

Heatwave Impact: ఎండలు మండుతున్న నేపథ్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే విశ్వవిద్యాలయ కళాశాలలలో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తరగతుల నిర్వహించనున్నట్లు ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. ఎండల తీవ్రత కారణంగా విద్యార్థుల క్షేమం కోసం స్వల్ప మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు.

ఒంటిపూట తరగతుల నిర్వహణపై రిజిస్ట్రార్ ఏం చెప్పారంటే?

తాజాగా ప్రిన్సిపాల్ డీన్ లు విభాగ అధిపతులతో చర్చించిన అనంతరం ఉప కులపతి  ఒంటిపూట తరగతులన నిర్వహణ నిర్ణయం తీసుకున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి తెలిపారు. పీజీ నాల్గవ సెమిస్టర్ విద్యార్థులకు విద్యా సంవత్సరంలో జాప్యం జరగకుండా మే 15 వరకు ఒక పూట తరగతుల నిర్వహించి అనంతరం పరీక్షలు నిర్వహించనున్నట్లు, పీజీ రెండవ సెమిస్టర్ విద్యార్థులకు ఏప్రిల్ 31 వరకు ఒక పూట తరగతులు నిర్వహించి అనంతరం వేసవి సెలవులు ప్రకటించనున్నట్లు అంజిరెడ్డి వెల్లడించారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు