విజయవాడ, క్రైమ్ మిర్రర్: మహిళలకు ఎన్ని చట్టాలు వచ్చిన వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ మహిళను న్యూడ్ ఫొటోలతో వేధించిన ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. భవానీపురం ప్రాంతంలో మద్దు బాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బాధిత మహిళను వేధింపులకు గురిచేశాడు. భర్తను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలంటూ డిమాండ్ చేశాడు. లేకపోతే న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో విసిగిపోయిన మహిళ వెంకటేశ్వర్లు వేధింపులు తీవ్రం కావడంతో పోలీసులను ఆశ్రయించింది. వెంకటేశ్వర్లు తనను లైంగికంగా వేధిస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా భవానీపురం జోజి నగర్‌లో మద్దు బాల వెంకటేశ్వర్లు కిరాణా స్టోర్ నిర్వహిస్తు అతడు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై బ్లాక్‌మెయిల్, లైంగిక వేధింపులు, బెదిరింపులు వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
