నంద్యాల, క్రైమ్ మిర్రర్: శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలో చిరుతపులి సంచారం గ్రామస్తులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆదివారం రాత్రి ఘాట్ రోడ్డులో భక్తులు వెళ్తుండగా చిరుతపులి తారసపడింది. దీంతో వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దోర్నాల వైపు వెళ్తున్న ప్రయాణికులకూ చిరుత కనిపించింది. రాత్రి సమయంలో వారంతా రోడ్డు పక్కన కూర్చుని ఉండగా చిరుతను గుర్తించారు.
కాసేపు భయాందోళనలకు గురైనా అనంతరం భక్తులు తేరుకుని చిరుతను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను కాస్తా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఓ భక్తుడు సూచించాడు. మరోవైపు అటవీశాఖ అధికారులు సైతం రంగంలోకి దిగారు. చిరుత నుంచి భక్తులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు.
