క్రైమ్ మిర్రర్,జాతీయం:- ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండడం అనేది సహజమైన విషయమే. ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అంతే హానికరం కూడా అని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాషింగ్ మిషన్ ఆన్ లో ఉన్నప్పుడు స్నానం చేయడం అనేది చాలా ప్రమాదకరమని ఎలక్ట్రీషియన్లు ఎన్నో సందర్భాలలో తెలిపారు. వాషింగ్ మిషన్ నడుస్తున్నప్పుడు విద్యుత్ లీకేజీ వల్ల షాపక్ తగిలేటువంటి ప్రమాదం ఉంది అని తెలిపారు. ఒకేసారి వైబ్రేషన్ అలాగే ప్రెజర్ వల్ల వైరింగ్ దెబ్బతిని తడి ప్రాంతానికి విద్యుత్ షాక్ తగలొచ్చు అని పేర్కొన్నారు. ఈ రోజుల్లో మిషన్ మరియు షవర్కు ఒకే వేస్టేజ్ పైప్ అనేది ఉంటుంది. కాబట్టి దీనివల్ల మరింత ఎక్కువగా ప్రమాదం జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే వాషింగ్ మిషన్ ఆఫ్ అయిన తరువాతనే ఎవరైనా సరే స్నానం చేయాలి అని.. వాషింగ్ మిషన్ ఆన్ లో ఉన్న సమయంలో ఎవరూ కూడా స్నానం చేయాలి అని చూడకండి. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ వస్తువుల పట్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అవి మన ప్రాణానికే ప్రమాదకరంగా మారుతాయి. కేవలం వాషింగ్ మిషన్ అనే ఎలక్ట్రానిక్ వస్తువు విషయం పట్ల మాత్రమే కాకుండా ఫ్రిజ్, ఫ్యాన్స్, కూలర్ మొదలగు అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.
నా అద్భుత ఇన్నింగ్స్ ధోనికే అంకితం : ముకుల్ చౌదరి
మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం…ఇద్దరు దుర్మరణం…!
