-
హస్తినాపురంలో మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్..
-
కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి..
క్రైమ్ మిర్రర్, ఎల్ బి నగర్: హైదరాబాద్‌లోని హస్తినాపురం వద్ద ఓ వ్యక్తి మద్యం మత్తులో కారును నడిపి ఇద్దరు ప్రాణాలు తీశాడు. కారును అతివేగంగా, అడ్డగోలుగా నడుపుతూ ఓ ద్విచక్ర వాహనాన్ని, నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుడిని ఢీకొట్టాడు. వారిని 100 మీటర్లకు వరకు అలాగే కారుతో ఈడ్చుకెళ్లాడు. అనంతరం కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు, నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
బైక్‌పై వెళ్తున్న వారిని మహవీర్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థులు శివ, సందీప్‌గా గుర్తించారు. ప్రమాదం గురించి తెలిసిన మహవీర్ కాలేజీ విద్యార్థులు కారు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. డ్రైవర్‌ను తమకు అప్పగించాలని నినాదాలు చేశారు. కాగా, ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
