హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ః రాష్ర్టంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెల ప్రారంభం కావడంతో ఉష్షోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండలు తీవ్రతరం కావడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే బయపడుతున్నారు. ప్రజలు ఉక్కపోతతో చల్లని ప్రదేశాలను ఆశ్రయిస్తున్నారు. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40°C నుండి 43°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్: పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వచ్చే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
హైదరాబాద్ పరిస్థితి: రాజధాని నగరంలో కూడా వేడి గాలుల ప్రభావం పెరుగుతోంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 39°C నుండి 41°C మధ్య నమోదు అవకాశం ఉంది. కాగా ప్రయాణాలు సాగించే వారు ఉదయం పూట లేదా సాయంత్రం వేళల్లో చేయాలని పేర్కొన్నారు.
