అమరావతి, క్రైమ్ మిర్రర్ః ఏపీ పునర్విభజన చట్టం-2014ను సవరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఈ నెల 1, 2 తేదీల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబదత్త వచ్చింది. ఈ సందర్భంగా రాజధానికి చట్టబద్ద కల్పిస్తూ విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
కాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ‘మన రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు ఎక్స్ లో పేర్కొన్నారు. బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ, మా వెన్నంటే నిలిచిన ప్రతి పౌరునికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. ముఖ్యంగా అమరావతి రైతుల విజయం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
