Homeఅంతర్జాతీయంఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా..!

ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా..!

  • ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా..!

  • ఇంట్లోనే సాఫ్ట్‌వేర్ దంపతులు ఆత్మహత్య

  • బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటన

  • కేసు నమోదు చేసినదర్యాప్తుచేస్తున్న పోలీసులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులో సిద్దిపేట జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగులోకి రావడం తో స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. స్థానికు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారంగా

సిద్దిపేట జిల్లాకు చెందిన భాను చందర్ రెడ్డి కుంట మరియు అతని భార్య బీబీ షాజియా సిరాజ్ సాఫ్ట్‌వేర్ దంపతులు బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. మంగళవారం వారు నివసిస్తున్న ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా దంపతులు విగతజీవులుగా కనిపించారు.

వారు ఆత్మహత్య చేసుకుని సుమారు రెండు మూడు రోజులు అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను సిద్దిపేట జిల్లాకు చెందిన భాను చందర్ రెడ్డి కుంట (32) మరియు అతని భార్య బీబీ షాజియా సిరాజ్ (31) గా గుర్తించారు. వీరు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు