త్రిపురారం (క్రైమ్ మిర్రర్): “ఐక్యమత్యమే మహాబలం” సంస్థ 5వ వార్షికోత్సవాన్ని నల్గొండ జిల్లా, త్రిపురారం మండలం, పానుగోతు తండాలో ఈరోజు ఘనంగా నిర్వహించింది. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ సంస్థ అనేక సామాజిక, విద్యా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూనే పలు గ్రామాల అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తోంది.

ఈ సందర్భంగా సభ్యులు పి. నరేష్ నాయక్ ఆ సంస్థ అధికారిక లోగోను ఆవిష్కరించారు. అదేవిధంగా పాఠశాలల నుండి గురుకుల పాఠశాలలకు ఎంపికైన విద్యార్థులను స్మారక చిహ్నాలతో సత్కరించారు. త్రిపురారం మండల పరిధిలో గల పాఠశాలలలో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి, వారికి స్మారక చిహ్నాలు అందజేశారు. ఐక్యమత్యమే మహాబలం సంస్థ గత ఐదు సంవత్సరాలుగా విద్య, సామాజిక సేవ, గ్రామాభివృద్ధి రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని పొందింది అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిషన్ నాయక్, రవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత, ఉపాధ్యాయులు బంగారు యాదవ్ పాల్గొన్నారు. అలాగే “ఐక్యమత్యమే మహాబలం” సంస్థ సభ్యులు పి. నరేష్ నాయక్, సంజయ్, రమేష్ నాయక్, స్వామి, భీమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువకులు మరియు విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
