Homeక్రైమ్రైతును చితకబాదిన మునుగోడు ఏఎస్ఐ

రైతును చితకబాదిన మునుగోడు ఏఎస్ఐ

నల్గొండ జిల్లాలో పోలీసులు రెచ్చిపోతున్నారు. జనాలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. గుర్రంపోడులో జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సీఐ, ఎస్ఐలపై వేటు పడింది. తాజాగా మునుగోడు ఏఎస్ఐ రెచ్చిపోయాడు. రైతుపై దాడి చేశాడు. వద్దని ప్రాదేపడుతున్నా వినకుండా కొట్టాడు. రైతును ఏఎస్ఐ కొడుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మునుగోడులో ఇద్దరు రైతుల మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. విచారణ కోసం వచ్చిన ఏఎస్ఐ.. రైతును పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లడానికి వచ్చాడు. అయితే పొలం పనులు ముగించుకుని వస్తానని ప్రాధేయపడ్డాడు రైతు ముత్యాలు. వినకుండా ఏఎస్ఐ రైతుపై దాడికి పాల్పడ్డాడు. అందరి ముందు రైతును చితకబాదాడు మునుగోడు ఏఎస్ఐ కోఠిసింగ్

RELATED ARTICLES

Most Popular

Recent Comments