Homeఅంతర్జాతీయంరేషన్ కార్డుదారులకు శుభవార్త...5 లక్షల జీవిత బీమా..!

రేషన్ కార్డుదారులకు శుభవార్త…5 లక్షల జీవిత బీమా..!

ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ

తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికీ రూ. 5 లక్షల జీవిత బీమా

e-KYC తప్పనిసరి లేకుంటే కార్డులు నిలిచిపోయే అవకాశం ఉంది.

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: రేషన్ కార్డు ఉన్నవారికి 2026 ఏప్రిల్ నెలలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక ప్రయోజనాలను ప్రకటించాయి. ముఖ్యంగా పంపిణీ విధానంలో మార్పులు మరియు కొత్త బీమా పథకాలు అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఏప్రిల్ 2026లో లబ్ధిదారులు ఏప్రిల్, మే, మరియు జూన్ 3  నెలలకు సంబంధించిన ఉచిత బియ్యం లేదా సరుకులను ఒకేసారి పొందవచ్చు.

వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు పదేపదే రేషన్ షాపులకు రావాల్సిన అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న కుటుంబాల కోసం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రకటించింది. దీని ద్వారా ప్రతి రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తారు. ఏప్రిల్ 1, 2026 నుండి రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడు e-KYC పూర్తి చేయడం తప్పనిసరి. కేవైసీ పూర్తి చేయని వారి కార్డులు నిలిచిపోయే అవకాశం ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు