Homeతెలంగాణమీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని ఎం.ఆర్.ఓ కి వినతి

మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని ఎం.ఆర్.ఓ కి వినతి

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి: మండల కేంద్రంలో ఉన్న రెండు మీ సేవ కేంద్రాలు గత కొన్ని నెలలుగా సమయపాలన పాటించడం లేదని, సమయానికి సేవలు అందించని కేంద్రాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని మండల రెవెన్యూ అధికారికి (MRO) బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెదమం భరత్ వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ… మండల కేంద్రంలో ఉన్న రెండు మీ సేవ కేంద్రాలు గత కొన్ని నెలలుగా సమయపాలన పాటించడం లేదని, సమయానికి సేవలు అందించని కేంద్రాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అయన వినతి పత్రంలో కోరారు. ఎప్పుడు చూసినా మూసి వేసి ఉంటున్నాయని, ఏ రోజు కూడా సమయపాలన పాటించడం లేదు అని వారికి ఇష్టం వచ్చిన సమయంలో అందుబాటులో ఉంటున్నారని, మండలం పరిధిలోని గ్రామాల ప్రజలు ఉదయం నుంచే కేంద్రాలకు వెళ్లినా, ఆలస్యంగా ప్రారంభించడం లేదా సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఫిర్యాదు చేశారు.

దీనివల్ల సాధారణ పనులు కూడా పూర్తవ్వడానికి ఎక్కువ సమయం పడుతోందని పేర్కొన్నారు.స్థానిక మీసేవ కేంద్రాల వల్ల ప్రజలకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు అన్నారు. అందువల్ల, సంబంధిత అధికారుల ద్వారా తనిఖీలు నిర్వహించి, సమయపాలన పాటించని కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే లైసెన్స్ రద్దు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అయన వెంటబిజెపి భారతీయ జనతా యువ నాయకులు పేరం విలేఖర్ మరియు గోపి, సతీష్, శివ ఉన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు