Homeవైరల్స్టార్ డైరెక్టర్ పై మోనాలిసా సంచలన ఆరోపణలు

స్టార్ డైరెక్టర్ పై మోనాలిసా సంచలన ఆరోపణలు

క్రైమ్ మిర్రర్, సినిమా:- మహా కుంభమేళాలో ఫేమస్ అయినటువంటి మోనాలిసా ప్రస్తుతం బిజీబిజీ జీవితాన్ని గడుపుతుంది. పలు సినిమాలకు అలాగే పలు బ్రాండ్లకు అడ్వర్టైజింగ్ చేస్తూ భారీగా రెమ్యూనరేషన్లు తీసుకుంటూ హీరోయిన్ గా నేడు ఆమె పలు సినిమాలలో నటిస్తున్నారు. అయితే తాజాగా గతంలో జరిగిన కొన్ని చేదు విషయాలు పంచుకుంటూ స్టార్ డైరెక్టర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. డైరెక్టర్ సరోజ్ మిశ్రా నాతో అసభ్యంగా ప్రవర్తించారు అని మోనాలిసా ఆరోపించారు. సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో సందర్భాల్లో నాతో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు నేను మైనర్ను అని… ఈ విషయాలను కుటుంబ సభ్యులకు చెప్పినా కూడా పట్టించుకోలేదు అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే డైరెక్టర్ సరోజ్ మిశ్రాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అని పేర్కొన్నారు. కాగా ఇటీవల తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి కాదు అని తను ప్రేమించిన ఫర్మాన్ ఖానును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత తన తల్లిదండ్రుల నుంచి నాకు ప్రాణహాని ఉంది అని పోలీసులను కూడా ఆశ్రయించింది.

Jeevan Reddy: హస్తం వదిలి గులాబీ గూటికి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రయత్నాలు విఫలం!

Delimitation Impact: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న నియోజకవర్గాలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు