Friday, March 20, 2026
Homeఆంధ్ర ప్రదేశ్తుది నిర్ణయానికి విజయసాయిరెడ్డి....చేరేది ఆ పార్టీలోనే..!

తుది నిర్ణయానికి విజయసాయిరెడ్డి….చేరేది ఆ పార్టీలోనే..!

  • చేరేది ఆ పార్టీలోనే

  • జూన్ తరువాత ఫుల్ క్లారిటీ

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ బ్యూరో: విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేరుతారు? సొంత పార్టీ పెట్టుకుంటారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? లేకుంటే బీజేపీలోకి వెళ్తారా? పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. ఏడాది కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి.

ఆ పార్టీ సభ్యత్వంతో పాటు ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పినట్టేనని తేల్చి చెప్పారు. కానీ ఆ మాట మీద ఉండలేకపోయారు. తరచూ పొలిటికల్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

మొన్న మధ్యాహ్నం మీడియా ముందుకు వచ్చి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతానని తేల్చి చెప్పారు. అప్పటినుంచి విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ పై అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి.

సొంత పార్టీ వర్కౌట్ కాలే..
ముందుగా తానే ఒక సొంత పార్టీ పెట్టేలా ప్లాన్ చేశారు విజయసాయిరెడ్డి. అయితే అది అంత సులువు కాదు కూడా. పైగా సొంత మీడియాను ఏర్పాటు చేస్తానని కూడా చెప్పారు. అది కూడా అంత సులువు కాదని తేలిపోయింది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు పిలుపు వచ్చిందని.. తిరిగి యూటర్న్ తీసుకుంటున్నారని పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ బయటకు వచ్చింది.

విజయసాయి రెడ్డి లాంటి నమ్మకస్తుడిని కోల్పోయి జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పడుతుండడాన్ని సన్నిహితులు గుర్తించారని.. తిరిగి పార్టీలోకి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డిని సూచించారని వార్తలు వచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి దగ్గర అయ్యే అవకాశాలు ఏవి కనిపించలేదు ఈ మధ్యలో.

కూటమి నుంచి అభ్యంతరాలు..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన బిజెపిలో చేరుతారని ప్రచారం సాగుతోంది. కానీ ఏపీలోని టిడిపి తో పాటు జనసేన నుంచి అనేక అభ్యంతరాలు ఉన్నాయి. దీంతో బీజేపీ పెద్దలు విజయసాయిరెడ్డి చేరికను పెండింగ్లో పెట్టారని తెలుస్తోంది. అయితే జూన్ తర్వాత దేశ రాజకీయాల్లో మార్పులు సంభవించే అవకాశం ఉంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు మే నెలలో జరగనున్నాయి. అందులో అస్సాంలో మాత్రమే బిజెపి అధికారంలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మిగతా రాష్ట్రాల్లో ఫైట్ కనిపిస్తోంది. ఒకవేళ బిజెపికి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే మాత్రం రాజకీయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అనుకూల ఫలితాలు వస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ హవా కొనసాగనుంది.

ఐదు రాష్ట్రాల ఫలితాలతో..
పశ్చిమ బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీతో హోరాహోరిగా తలపడుతోంది బిజెపి. ఒకవేళ అక్కడ బిజెపి ఓడిపోతే మాత్రం ఆ పార్టీకి షాక్ తప్పదు. మరోవైపు తమిళనాడులో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉంది. అక్కడ మరోసారి ఆ కూటమి అధికారంలోకి వస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. కేరళలో ఆ పార్టీ ప్రభావం చాలా తక్కువ.

అయితే ఇండియా కూటమి గెలుపు సాధిస్తే మాత్రం బిజెపి పునరాలోచనలో పడుతుంది. బలపడేందుకు చేరికలను ప్రోత్సహిస్తుంది. అలా విజయసాయిరెడ్డి బిజెపికి దగ్గర అయ్యేందుకు తప్పకుండా ప్రయత్నాలు చేస్తారు. ఆయన అంతిమంగా బిజెపికి చేరువ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. బిజెపి పెద్దల ద్వారా తన పని కానివ్వడమే కాదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తానంటే టిడిపి తో పాటు జనసేన కూడా ఒప్పుకునే ఛాన్స్ కనిపిస్తోంది.

వైసీపీలోకి నో ఛాన్స్..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి వైసీపీలో చేరలేరు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే మద్యం కుంభకోణంలో అరెస్టులు జరిగినట్లు వైసీపీకి కోపం ఉంది. అందుకే ఒకవేళ విజయసాయిరెడ్డి వస్తానని ముందుకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి మాత్రం చేర్చుకునే ఛాన్స్ కనిపించడం లేదు.

అందుకే బిజెపి పెద్దలపై విజయసాయిరెడ్డి ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. కూటమి నేతలను సర్ది చెప్పి విజయసాయిరెడ్డిని బిజెపిలోకి తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. అయితే ఏదైనా జూన్ తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments