Homeక్రైమ్H-FAST: ఇక పై ఆహార కల్తీ పై ఇలా పిర్యాదు చేయండి...!

H-FAST: ఇక పై ఆహార కల్తీ పై ఇలా పిర్యాదు చేయండి…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీని అరికట్టడానికి మరియు ప్రజారోగ్యాన్ని కాపాడటానికి హైదరాబాద్ పోలీసులు H-FAST (Hyderabad Food Analysis and Surveillance Team) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఈ టీమ్ సమన్వయంతో పనిచేస్తుంది.

H-FAST: ఇక పై ఆహార కల్తీ పై ఇలా పిర్యాదు చేయండి...!
H-FAST: ఇక పై ఆహార కల్తీ పై ఇలా పిర్యాదు చేయండి…!

టీం హోటళ్లు, రెస్టారెంట్లు మరియు తయారీ కేంద్రాలలో ఆహార నాణ్యతను పర్యవేక్షించడం. కల్తీ జరిగినట్లు సమాచారం అందిన వెంటనే దాడులు నిర్వహించి శాంపిల్స్‌ను సేకరించడం.నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం మరియు అవసరమైతే విక్రయశాలలను మూసివేయడం.

ఆహార కల్తీ జరిగితే వెంటనే కింది కాంటాక్ట్ నంబర్లతో పిర్యాదు చెయ్యండి:

H-FAST టోల్ ఫ్రీ నంబర్: 8712661212. ఇది ప్రత్యేకంగా హైదరాబాద్ పోలీసుల ‘హెచ్-ఫాస్ట్’ (Hyderabad Food Adulteration Surveillance Team) విభాగానికి సంబంధించిన ఫిర్యాదుల కోసం కేటాయించబడింది.

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ హెల్ప్‌డెస్క్: 9100105795. రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ కార్యాలయానికి నేరుగా ఫిర్యాదు చేయడానికి ఈ నంబర్‌ను ఉపయోగించవచ్చు.

GHMC కాల్ సెంటర్: 040-21111111. హోటళ్లు లేదా రెస్టారెంట్లలో అపరిశుభ్రత, నాణ్యత లేని ఆహారంపై ఫిర్యాదు చేయడానికి ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు