క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే పలు దేశాలలో నిత్యవసర సరుకులు వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఈ యుద్ధం దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై ప్రభావం చూపుతుంది అని చెప్పాలి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా పాల్గొని ఈ యుద్ధ ప్రభావం పై వ్యాఖ్యానిస్తూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యుద్ధ ప్రభావంతో వివిధ ఉత్పత్తుల మార్కెటింగ్ కు ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి అని పేర్కొన్నారు.ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ ప్రభావం మన భారత దేశంపై పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక చర్యలు చేపడుతున్నారు అని స్పష్టం చేశారు. కష్టకాలంలో ప్రతి ఒక్కరూ కూడా సమిష్టిగా పని చేయాలి అని.. అప్పుడే ఎటువంటి ఆటంకులు వచ్చినా కూడా ముందుకు సాగగలము అని అన్నారు. ఇటువంటి తరుణంలోనే పొట్టి శ్రీరాములు త్యాగం గురించి ఆలోచన చేసి.. వారి ఆలోచనల విధానాలను పాటిస్తూ ముందుకు వెళ్లాలని తెలిపారు. రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధి ఆగకుండా ఆలోచనతో ముందడుగు వేయాలి అని సూచించారు.
పంటలు కోతకొచ్చిన రైతుబంధుపై స్పష్టత లేదు : కేటీఆర్
హర్రర్ సినిమాలకు కథ అక్కర్లేదంటున్న ఆర్జీవీ
