Homeతెలంగాణప్రజల మనిషికి పట్టం కట్టేది ఎప్పుడు..?

ప్రజల మనిషికి పట్టం కట్టేది ఎప్పుడు..?

  • ప్రజల మనిషికి పట్టం కట్టేది ఎప్పుడు..?

  • నిస్వార్థ నాయకుడు… నిరంతర ప్రజా సేవకుడు

  • అధికారంలో లేకున్నా…జనంతోనే ఉన్నాడు

  • నిజాయితీగా సేవ చేయడమే జిన్నారెడ్డి నైజం

  • ప్రజల బాధలో భాగస్వామ్యం… ఆపదలో అండగా

  • సాయం చేసేందుకు ఎప్పుడు ముందుండే జిన్నారెడ్డి

  • జిన్నారెడ్డి సేవలను రాష్ట్ర స్థాయిలో వినియోగించుకోవాలి, ఉన్నత పదవి ఇవ్వాలి

  • అభిమానుల ఆకాంక్ష..!

క్రైమ్ మిర్రర్, హుజూర్ నగర్: రాజకీయాల్లో ఉన్నత పదవులకు అన్ని అర్హతలు ఉన్నా రాజకీయ సమీకరణల నేపథ్యంలో సరైన అవకాశాలు లభించకున్నా ప్రజాసేవలో నేనున్నానంటూ ఇటు రాజకీయంగా, వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో ప్రత్యేక స్థానాన్ని పొందుతున్నారు.

కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జిన్నారెడ్డి శ్రీనివాస రెడ్డి సాయం అందించేందుకు ఎల్లవేళలా నేనున్నా అంటూ ప్రతి సందర్భంలోనూ సాయం అవసరం ఉన్న ప్రతి చోట తన వంతు సహకారం అందిస్తూ వస్తున్నారు.

పదవి ఉన్నా…లేకున్నా… నాటి నుండి నేటి వరకు మొక్కవోని ధైర్యం, పార్టీ గుర్తిస్తుంది అనే నమ్మకం,ఎల్లప్పుడూ ప్రజల కోసం నేనున్నా ప్రజలకు సేవ చేసేందుకు, వారికి ఎల్లప్పుడూ అండదండగా నిలిచేందుకు, పదవి ఉన్నా, లేకున్నా, అనునిత్యం ప్రజల మధ్యలోనే నేనుంటున్నానంటూ కొన్నెండ్లుగా జిన్నారెడ్డి ఫౌండేషన్ ద్వారా పేద, మధ్యతరగతి , యువతకు సహాయ, సహకారాలు అందిస్తున్నారు.

జిన్నారెడ్డి ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జిన్నారెడ్డి శ్రీనివాస రెడ్డి.సాధారణంగా పెద్ద పదవుల్లో ఉన్నవారు ప్రజలకు దూరంగా ఉంటారనే విమర్శ ఉంటుంది. కానీ జిన్నారెడ్డి ఏ పదవిలో ఉన్నా, లేకపోయినా సామాన్యులకు అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే ‘గ్రౌండ్ లెవల్ లీడర్ “అని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

జిన్నారెడ్డి నేపద్యం, రాజకీయ ప్రస్థానం

ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉమ్మడి నేరేడుచర్ల మండల మూసిఒడ్డు సింగారం లో జన్మించిన శ్రీనివాస్ రెడ్డి న్యాయవాద విద్యను అభ్యసించి వృత్తిపరంగా సేవలందిస్తూనే కాంగ్రెస్ పార్టీలో గత మూడు దశాబ్దాలుగా సేవలందిస్తూ వైఎస్ కుటుంబ సభ్యులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి హుజూర్నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాల్లో తన వంతు సహకారం అందిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులుగా సేవలందిస్తూ వస్తున్నారు.

జిన్నారెడ్డి ఫౌండేషన్ ద్వారా సేవలు

ప్రజా సేవే లక్ష్యంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు.చిన్న సమస్య మొదలు, విద్య, ఆరోగ్యం, క్రీడలు, శుభకార్యాలు, ఆశుభకార్యాలు, రాజకీయ అవసరాలు అనేకమందికి సహకార అందిస్తూ వస్తున్న జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు మంచి ఉన్నత అవకాశాలు కల్పించాలని అభిమానులు కోరుతున్నారు.

విశ్వసనీయతకు మారుపేరు జిన్నారెడ్డి

రాజకీయాల్లో పార్టీలు మారడం, ఫిరాయింపులు చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం కానీ దశాబ్దాలుగా ఒకే సిద్దాంతానికి కట్టుబడి ఉండి కాంగ్రెస్ జెండాను మోస్తు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి నేటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు వారి ఆచరణ ను పాటిస్తున్నారు.”నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వ్యక్తికి పదవి ఇస్తేనే కదా వ్యవస్థ బాగుపడేది” అనేది సామాన్యులు మాట.

అపార రాజకీయ అనుభవమే పెట్టుబడి

అపార అనుభవం ఉండి రాజకీయాన్ని మార్చగలిగే సత్తా, తెలివి ఉండి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరి పరిచయాలు చూసిన వ్యక్తి కాపడంతో, క్షేత్రస్థాయిలో ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారం కావాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయనను రాష్ట్ర స్థాయికి పంపితే, అది జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని జిన్నారెడ్డి కి సముచిత స్థానం కల్పించాలని అభిమానులు కోరుతున్నారు.

యువతకు మార్గదర్శి

ఉన్నత విద్యావంతుడు , న్యాయవాది గా రాణిస్తూ మిత్రులు ఆయనను” వకీలు సాబ్” ఆ అంటారు.నేటి తరం రాజకీయ నాయకులకు క్రమశిక్షణ, ఓర్పు, మరియు ప్రజలతో ఎలా మెలగాలి అనే విషయాల్లో ఆయన ఒక పాఠశాల లాంటివారు. నిరాడంబర జీవితం గడుపుతూ, పార్టీ ఆచరణలు పాటిస్తూ గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్తున్న ఆయన తీరు యువతను ఆకర్షిస్తోంది.

అభిమానుల ఆకాంక్ష

నిజాయితీ, నిబద్ధత ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం కష్టపడే నాయకులకు ఉన్నత స్థానాలు ఇవ్వాలని ప్రజల కష్టాలను అర్థం చేసుకుని,వారి సమస్యలను పరిష్కరించే నాయకుడికి ఉన్నత పదవి దక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు.

నియోజక వర్గ ప్రజల డిమాండ్

జిన్నారెడ్డి కి రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వడం అంటే కేవలం ఆయనకు ఇచ్చే గౌరవం మాత్రమే కాదు, ఆయనను నమ్ముకున్న వేలాది మంది కార్యకర్తలకు, ప్రజలకు ఇచ్చే గుర్తింపు అని నీతి, నిజాయితీ లకు నిలువెత్తు నిదర్శనం అని, నిబద్ధత గల నాయకుడిగా ఉన్న జిన్నారెడ్డి శ్రీనివాస రెడ్డి సేవలను రాష్ట్ర స్థాయిలో వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు పార్టీ అధిష్టానంపై ఉంది. ప్రజల ఆకాంక్ష నెరవేరితే, అది జిల్లా, నియోజకవర్గ రాజకీయాల్లో ఒక కొత్త వెలుగును నింపుతుందనడంలో సందేహం లేదు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు