దోష, పూరీలు తాత్కాలికంగ నిలిపివేత
హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ప్రభావంతో హైదరాబాద్ హోటళ్లపై పడింది. గ్యాస్ కొరతతో హోటళ్లు, హాస్టళ్లు, మెస్లు తాత్కాలికంగా మూసివేసే దిశగా సాగుతున్నాయి. మరికొన్ని హోటళ్లు మెనూను కుదించి, ధరలు పెంచాయి.
వండేందుకు ఎక్కువ నూనె తీసుకునే, ఎక్కువ సమయం తీసుకునే టీ, కాఫీ, చపాతీ, దోశ, పూరిలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్ ప్రకటించింది. ఎక్కువ సేపు వండే వంటలను తగ్గించి అన్నం, సాంబార్, పప్పు, రసంలనే హైదరాబాద్లోని పీజీ హాస్టళ్లు, మెస్లు వడ్డిస్తున్నాయి. రవాణా ఛార్జీలు పెరగడంతో దోశ, పూరి, వడలపై కనీసం రూ.15 ఇడ్లీ, ఉప్మా లాంటి వాటిపై కనీసం రూ.10 వరకు పెంచారు.
