Homeతెలంగాణతెలంగాణ గ‌ళాన్నిరాజ‌ధానిలో బ‌లంగా వినిపించాలి: పొంగులేటి

తెలంగాణ గ‌ళాన్నిరాజ‌ధానిలో బ‌లంగా వినిపించాలి: పొంగులేటి

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్: తాజాగా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సంద‌ర్భంగా వేం నరేందర్ రెడ్డి మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార ,పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

రాజ్య స‌భ్యుడిగా ఎన్నికైన సంద‌ర్భంగావేం న‌రేందర్ రెడ్డిని శాలువాతో ఘ‌నంగా స‌న్మానించారు.అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ప్రజా సేవలో ఆయనకు ఉన్న అనుభవం, నిబద్ధత అంకితభావం తెలంగాణ గళాన్ని దేశ రాజధానిలో బలంగా వినిపించడానికి ఎంతో దోహదపడతాయని మంత్రి ఆకాంక్షించారు.రాజ్యసభలో ఆయన పార్లమెంటరీ ప్రస్థానం విజయవంతంగా సాగుతూ, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

తాజావార్తలు