Tuesday, March 10, 2026
Homeతెలంగాణప్రజా సమస్యలపై 'క్రైమ్ మిర్రర్' చొరవ.. దట్నూరులో వెలిగిన వీధి దీపాలు!

ప్రజా సమస్యలపై ‘క్రైమ్ మిర్రర్’ చొరవ.. దట్నూరులో వెలిగిన వీధి దీపాలు!

జగిత్యాల జిల్లా,క్రైమ్ మిర్రర్:-గొల్లపల్లి,మండలంలోని దట్నూరు గ్రామంలో నెలకొన్న పారిశుధ్య లోపం, వీధి దీపాల సమస్యపై ‘క్రైమ్ మిర్రర్’ ప్రతినిధి చేసిన విజ్ఞప్తికి అధికారులు సానుకూలంగా స్పందించారు.​దట్నూరు గ్రామ ప్రధాన రహదారి పక్కన వీధి స్తంభాలకు లైట్లు లేక చీకటి అలుముకోవడం, పిచ్చి మొక్కలు పెరిగిపోయి పారిశుధ్యం అధ్వానంగా మారడంపై స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ‘క్రైమ్ మిర్రర్’ గమనించి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ గారి దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను వివరించడమే కాకుండా, ప్రజల ఇబ్బందులను వారికి వివరించారు.​సెక్రెటరీ గారి సానుకూల స్పందన:రిపోర్టర్ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన పంచాయతీ సెక్రెటరీ, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లు, పిచ్చి మొక్కలను కొట్టించి పారిశుధ్యం మెరుగుపరిచారు. అంతేకాకుండా, వెలగని వీధి దీపాలకు కొత్త లైట్లు వేయించి గ్రామంలో వెలుగులు నింపారు.​తమ సమస్యను గుర్తించి అధికారులతో మాట్లాడి పరిష్కరింపజేసిన ‘క్రైమ్ మిర్రర్’ ప్రతినిధికి మరియు వెంటనే స్పందించి పనులు చేయించిన పంచాయతీ సెక్రెటరీ గారికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

AP Politics: దువ్వాడ ఇన్.. ధర్మాన బ్రదర్స్ అవుట్!?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments